నిర్దేశిత విధానంలోనే ప్రమాణం చేయండి

పార్లమెంటులో ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్‌లో నిర్దేశించిన విధానాన్నే అనుసరించాలని లోక్‌సభ సభ్యులకు స్పీకర్‌ ఓం బిర్లా స్పష్టం చేశారు.

Published : 02 Jul 2024 04:13 IST

అన్య పదాలు జోడిస్తే రాజ్యాంగ గౌరవం దెబ్బతింటుంది: ఓం బిర్లా

దిల్లీ: పార్లమెంటులో ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్‌లో నిర్దేశించిన విధానాన్నే అనుసరించాలని లోక్‌సభ సభ్యులకు స్పీకర్‌ ఓం బిర్లా స్పష్టం చేశారు. అన్య పదాలు జోడిస్తే రాజ్యాంగ గౌరవం దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఇటీవల పలువురు సభ్యులు ప్రమాణ సమయంలో ‘జై సంవిధాన్‌’, ‘జై హిందూరాష్ట్ర’ అని నినాదాలు చేయడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై ఓం బిర్లా సోమవారం లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని లోతుగా పరిశీలించేందుకు ప్రధాన పార్టీల ప్రతినిధులతో ఓ కమిటీ వేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ‘‘నిర్దేశిత ఫార్మాట్‌ ప్రకారమే సభ్యులు ప్రమాణం, ప్రకటనలు చేయాలని సభ తీర్మానిస్తోంది. భవిష్యత్తులోనూ దీన్ని ఉల్లంఘించరని ఆశిస్తున్నాం’’ అని ఓం బిర్లా పేర్కొన్నారు. 

నేడు లోక్‌సభలో మోదీ ప్రసంగం

దిల్లీ: రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం సాయంత్రం లోక్‌సభలో ప్రధాని మోదీ సమాధానమివ్వనున్నారు. 16 గంటల చర్చ పూర్తయ్యాక ఆయన సమాధానం ఉండనుంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని