మేధా పాట్కర్‌కు 5 నెలల జైలు శిక్ష

ఇరవై మూడేళ్ల క్రితంనాటి పరువు నష్టం దావాలో ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు దిల్లీ  మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ రాఘవ్‌ శర్మ సోమవారం అయిదు నెలల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించారు.

Published : 02 Jul 2024 04:19 IST

దిల్లీ: ఇరవై మూడేళ్ల క్రితంనాటి పరువు నష్టం దావాలో ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు దిల్లీ  మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ రాఘవ్‌ శర్మ సోమవారం అయిదు నెలల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించారు. పై కోర్టుకు అప్పీలు చేసుకోవడానికి వీలుగా శిక్ష అమలును నెల రోజులపాటు నిలిపివుంచారు. ప్రస్తుతం దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా గతంలో గుజరాత్‌లో కౌన్సిల్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ అనే స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌గా ఉండేవారు. అప్పుడు పాట్కర్‌ ఆయననను పిరికిపందగా, హవాలా లావాదేవీల్లో భాగస్వామిగా అభివర్ణించారు. ఆ వ్యాఖ్యలు తనకు పరువు నష్టం కలిగించాయని సక్సేనా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో చివరకు పాట్కర్‌కు కోర్టు శిక్ష విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని