ప్రభుత్వ పాఠశాలలో ఏసీ తరగతి గదులు

విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయులు ఏసీ తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Published : 01 Jul 2024 05:13 IST

పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయుల చొరవ

ఈటీవీ భారత్‌: విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయులు ఏసీ తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు ముర్షీరాబాద్‌ జిల్లా కందిలో ఉన్న రాషోర అంబికా హైస్కూల్‌లో విద్యార్థుల కోసం తరగతి గదుల్లో ఏసీలు అమర్చారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా తరగతి గదుల్లో వేడికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా హాజరు శాతం పడిపోయింది. రోజురోజుకు గైర్హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య పెరగుతోంది. ఈ దుస్థితికి అడ్డుకట్ట వేసేందుకు  పాఠశాల ఉపాధ్యాయులు నడుం బిగించారు. ఈ మేరకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తరగతి గదుల్లో ఏసీలు బిగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి కంది పురపాలక సంఘం ఛైర్మన్, స్థానిక శాసనసభ్యుడు కూడా అంగీకారం తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు చందాలు వేసుకుని, విరాళాలు సేకరించి రూ.3.75 లక్షలు సమీకరించారు. ఆ మొత్తంతో తరగతి గదుల్లో 8 ఏసీలు ఏర్పాటుచేశారు. తమ ప్రయత్నం విజయవంతమైందని, ప్రస్తుతం విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు. సిలబస్‌ను సకాలంలో పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని