పార్లమెంటులో దుమారం రేపనున్న నీట్‌

నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు సోమవారం పార్లమెంటులో దుమారం రేకెత్తించే అవకాశాలున్నాయి.

Published : 01 Jul 2024 05:09 IST

దిల్లీ: నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు సోమవారం పార్లమెంటులో దుమారం రేకెత్తించే అవకాశాలున్నాయి. గతవారం వాయిదాపడిన సభలు పునఃప్రారంభం కాగానే విపక్షాలు దీనిపై ఆందోళన వినిపించేందుకు సన్నద్ధంగా ఉన్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్ర మాజీమంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. తీర్మానంపై చర్చకు లోక్‌సభ 16 గంటల సమయాన్ని కేటాయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని