కేదార్‌నాథ్‌ సమీపంలో విరిగిపడ్డ మంచుచరియ

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల పైనున్న గాంధీ సరోవరం వద్ద ఆదివారం ఉదయం భారీ మంచుచరియ విరిగిపడింది.

Published : 01 Jul 2024 05:09 IST

రుద్రప్రయాగ్, జమ్మూ: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల పైనున్న గాంధీ సరోవరం వద్ద ఆదివారం ఉదయం భారీ మంచుచరియ విరిగిపడింది. చోరాబరి హిమానీనదం సమీపంలో విరిగి పడిన మంచుచరియ అనంతరం అదే ప్రాంతంలోని లోయలోకి జారింది. ఉదయం 5 గంటల సమయంలో సంభవించిన ఈ ఘటనను కేదార్‌నాథ్‌ ఆలయానికి వెళ్లిన భక్తులు తమ మొబైల్‌ ఫోన్లలో బంధించారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని రుద్రప్రయాగ్‌ జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ అధికారి నందన్‌సింగ్‌ రాజ్‌వార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని