6,619 మందితో అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరిన మూడో బ్యాచ్‌

జమ్మూలోని భగవతీ నగర్‌లోని బేస్‌ క్యాంపు నుంచి 6,619 మందితో కూడిన మూడో బ్యాచ్‌ కశ్మీర్‌లోని బేస్‌ క్యాంపులకు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరింది.

Published : 01 Jul 2024 05:08 IST

జమ్మూ: జమ్మూలోని భగవతీ నగర్‌లోని బేస్‌ క్యాంపు నుంచి 6,619 మందితో కూడిన మూడో బ్యాచ్‌ కశ్మీర్‌లోని బేస్‌ క్యాంపులకు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరింది. వీరిలో 1,141 మంది మహిళలు ఉన్నారని, 319 వాహనాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య యాత్రికులు బయలుదేరారని అధికారులు తెలిపారు. 52రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 19తో ముగియనుంది. 


రెండు కాళ్లు లేకున్నా..

ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయినా.. ఆత్మ విశ్వాసంతో అతడు ముందుకు కదిలాడు. ఓ టైర్‌ ముక్కలో కూర్చొని రెండు చేతులతో ముందుకు కదులుతూ.. అమర్‌నాథ్‌ గుహాలయ దర్శనానికి బయలుదేరాడు రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన ఆనంద్‌ సింగ్‌. 2002లో జరిగిన ఓ ప్రమాదంలో తన రెండు కాళ్లను కోల్పోయానని, 2010 నుంచి ఏటా ఈ యాత్రకు వస్తున్నానని ఆనంద్‌ తెలిపాడు. అమర్‌నాథ్‌కు రావడం ఇది 12వ సారి అని పేర్కొన్నాడు. వరదల కారణంగా 2013లో, కరోనా సమయంలో మరో రెండేళ్లు యాత్రకు రాలేదని వివరించాడు. మొదటి ఐదేళ్లు చేతులతో నడుచుకుంటూ యాత్రకు వచ్చానని, ఇప్పుడు అది కష్టమవడంతో పల్లకిలో ప్రయాణిస్తున్నానని చెప్పాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని