కుటుంబ పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ప్రచారం

కుటుంబ పింఛనుదారుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ సోమవారం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

Published : 01 Jul 2024 05:07 IST

నేడు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ 

దిల్లీ: కుటుంబ పింఛనుదారుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ సోమవారం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ సెంట్రలైజ్డ్‌ పెన్షన్‌ గ్రీవెన్స్‌ అండ్‌ సిస్టమ్‌(సీపెన్‌గ్రామ్స్‌)లో ఏడాదికి సుమారు 90,000 కేసులు నమోదవుతున్నాయని సిబ్బంది మంత్రిత్వశాఖ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో కుటుంబ పింఛనుదారుల ఫిర్యాదులు 20 శాతం నుంచి 25 శాతం ఉంటున్నాయని పేర్కొంది. రక్షణశాఖ, రైల్వే, సీఏపీఎఫ్‌ పింఛనుదారుల ఫిర్యాదులతో పాటు బ్యాంకు సంబంధిత సమస్యలపైనా ఫిర్యాదులు అధికంగా నమోదవుతున్నాయని వెల్లడించింది. పింఛను, పింఛనర్ల సంక్షేమ శాఖ (డీఓపీపీడబ్ల్యూ) 100 రోజుల కార్యాచరణలో భాగంగా జులై నెల మొత్తం కుటుంబ పింఛనుదారుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టనుంది. కుటుంబ పింఛనుదారులు తమ ఫిర్యాదులను నేరుగా www.pgportal.gov.in/ PENSION/ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించింది. గతంలో వారు నమోదు చేసిన ఫిర్యాదులను ఇప్పటికే వేరు చేసి ఈ పోర్టల్‌లో పొందుపరిచామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని