ఏఐతో గొంతు మార్చి.. పురుషుడిలా మాట్లాడిన మహిళ

కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ఓ మహిళ పురుషుడిలా గొంతు మార్చి ఓ యువతి నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఠాణెకు చెందిన ఓ మహిళ ఏఐ సాయంతో పురుషుడిలా తన పొరుగింటి యువతికి ఫోన్‌ చేసింది.

Published : 30 Jun 2024 05:37 IST

యువతికి రూ.6 లక్షల టోకరా

ముంబయి: కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ఓ మహిళ పురుషుడిలా గొంతు మార్చి ఓ యువతి నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఠాణెకు చెందిన ఓ మహిళ ఏఐ సాయంతో పురుషుడిలా తన పొరుగింటి యువతికి ఫోన్‌ చేసింది. పలు రకాలుగా బెదిరించి.. రూ.6 లక్షలకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత కూడా వేధిస్తుండటంతో బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితురాలిని అరెస్ట్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని