ఎమర్జెన్సీలో జైల్లో వేసినా.. దేశద్రోహి అనలేదు: లాలూ

దాదాపు 50 ఏళ్ల క్రితం ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ఇటీవల రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆ అత్యయిక పరిస్థితిని ఉద్దేశించి ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.

Published : 30 Jun 2024 05:35 IST

పట్నా: దాదాపు 50 ఏళ్ల క్రితం ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ఇటీవల రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆ అత్యయిక పరిస్థితిని ఉద్దేశించి ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ స్పందించారు. నాడు ఇందిర తమను జైల్లో పెట్టించినా ఎన్నడూ వేధించలేదని తెలిపారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జయప్రకాశ్‌ నారాయణ్‌ ఏర్పాటు చేసిన కమిటీకి కన్వీనర్‌గా పని చేశాను. అంతర్గత భద్రత చట్టం కింద అరెస్టు చేసి జైల్లో పెట్టారు. 15 నెలలు కారాగారంలో ఉన్నాను. ఆమె కానీ, ఆనాటి ప్రభుత్వంలోని మంత్రులు కానీ మమ్మల్ని దేశద్రోహి అనలేదు. మన ప్రజాస్వామ్యంపై 1975 నాటి అత్యవసర పరిస్థితి ఒక మరకలాంటిదే. కానీ, 2024లో విపక్షాలను గౌరవించని వారిని ఎవరూ మర్చిపోకూడదు’ అని లాలూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని