ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి 40% ప్రమాదభత్యం : అమిత్‌ షా

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) చేపట్టే కీలకమైన ఆపరేషన్లను దృష్టిలో ఉంచుకొని సిబ్బందికి 40 శాతం ప్రమాద భత్యాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శనివారం వెల్లడించారు.

Published : 30 Jun 2024 05:34 IST

దిల్లీ: జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) చేపట్టే కీలకమైన ఆపరేషన్లను దృష్టిలో ఉంచుకొని సిబ్బందికి 40 శాతం ప్రమాద భత్యాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శనివారం వెల్లడించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని 21,625 అడుగుల ఎత్తయిన మణిరంగ్‌ పర్వతాన్ని ఇటీవల అధిరోహించిన 35 మంది సభ్యుల ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని స్వాగతిస్తూ ఆయన మాట్లాడారు. ‘‘ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది దీర్ఘకాలిక డిమాండును కేంద్రం ఆమోదించింది. దీని ద్వారా దళానికి చెందిన 16 వేల మంది సిబ్బందికి లబ్ధి చేకూరనుంది’’ అని తెలిపారు. కేంద్ర సాయుధ బలగాలతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ వంటి సంస్థల్లో క్రీడల సంస్కృతిని తీసుకురావాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ఈ బలగాల నుంచి కనీసం ఒక బృందం తప్పనిసరిగా జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనాలని, ఇందుకోసం ఐబీ డైరెక్టరు నేతృత్వంలోని కమిటీ రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేసిందని అమిత్‌ షా చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు