విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శిగా విక్రమ్‌ మిస్రీ నియామకం

ప్రస్తుతం జాతీయ భద్రత ఉపసలహాదారుగా ఉన్న విక్రమ్‌ మిస్రీ (59) విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా శుక్రవారం నియమితులయ్యారు.

Published : 29 Jun 2024 05:43 IST

దిల్లీ: ప్రస్తుతం జాతీయ భద్రత ఉపసలహాదారుగా ఉన్న విక్రమ్‌ మిస్రీ (59) విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా శుక్రవారం నియమితులయ్యారు. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ 1989 బ్యాచ్‌కు చెందిన ఈ సీనియర్‌ అధికారి చైనా వ్యవహారాల్లో నిష్ణాతుడు. వినయ్‌ క్వాత్రా స్థానంలో విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి బాధ్యతలను జులై 15న విక్రమ్‌ మిస్రీ చేపడతారని కేబినెట్‌ నియామకాల కమిటీ తెలిపింది. ప్రస్తుత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా త్వరలో అమెరికాలో భారత రాయబారిగా నియమితులు కానున్నారని అధికార వర్గాల సమాచారం. విక్రమ్‌ మిస్రీ....గతంలో ముగ్గురు ప్రధాన మంత్రుల (ఐ.కె.గుజ్రాల్, మన్మోహన్‌సింగ్, నరేంద్ర మోదీ) వద్ద ప్రైవేటు సెక్రెటరీగా సేవలు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని