నీట్‌-యూజీ పేపర్‌ లీకు కేసు.. ఝార్ఖండ్‌లో ప్రిన్సిపల్, వైస్‌ప్రిన్సిపల్‌ అరెస్టు

నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకు కేసుకు సంబంధించి ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఓ పాఠశాల ప్రిన్సిపల్, వైస్‌ప్రిన్సిపల్‌ను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది.

Published : 29 Jun 2024 05:39 IST

దిల్లీ: నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకు కేసుకు సంబంధించి ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఓ పాఠశాల ప్రిన్సిపల్, వైస్‌ప్రిన్సిపల్‌ను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. హజారీబాగ్‌ నగరంలో నీట్‌ పరీక్ష నిర్వహణకు స్థానిక ఒయాసిస్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఎహ్‌సానుల్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. వైస్‌ప్రిన్సిపల్‌ ఇంతియాజ్‌ ఆలం ఎన్‌టీఏ అబ్జర్వర్, ఒయాసిస్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం సమన్వయకర్తగా వ్యవహరించారని సీబీఐ అధికారులు వెల్లడించారు. వారిద్దరిని పూర్తిస్థాయిలో ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసినట్లు వివరించారు. ఇదే కేసులో జిల్లాకు చెందిన మరో అయిదుగురిని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని