పనితీరు బాగోకపోతే ముందస్తుగా పదవీ విరమణ

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాలూ తమ సిబ్బంది పనితీరుకు సంబంధించిన నివేదికను ప్రతి నెలా 15వ తేదీలోగా అందించాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌(డీఓపీటీ) స్పష్టం చేసింది.

Published : 29 Jun 2024 05:39 IST

ప్రతి నెలా ఉద్యోగులపై నివేదిక 

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాలూ తమ సిబ్బంది పనితీరుకు సంబంధించిన నివేదికను ప్రతి నెలా 15వ తేదీలోగా అందించాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌(డీఓపీటీ) స్పష్టం చేసింది. ఆ నివేదికల ఆధారంగా పనితీరు సరిగా లేని వారితో ముందస్తుగా పదవీ విరమణ చేయించే దిశగా కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా అన్ని మంత్రిత్వ శాఖలతోపాటు పీఎస్‌యూలు, బ్యాంకులు, స్వయంప్రతిపత్తి సంస్థలు, చట్టబద్ధ వ్యవస్థల ఉన్నతాధికారులకు ఇప్పటికే నిబంధనలతో కూడిన ఆదేశాలను పంపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని