పరీక్షల నిర్వహణకు ఎన్‌టీఏ కొత్త తేదీల ప్రకటన

ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలతో జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ఇటీవల రద్దుచేసిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు శుక్రవారం కొత్త తేదీలను ప్రకటించింది.

Published : 29 Jun 2024 05:39 IST

దిల్లీ: ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలతో జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ఇటీవల రద్దుచేసిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు శుక్రవారం కొత్త తేదీలను ప్రకటించింది. జులై 10న నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎన్‌సీఈటీ), జులై 25-27 తేదీల్లో సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్, ఆగస్టు 21-సెప్టెంబరు 4 తేదీల మధ్యలో యూజీసీ-నెట్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. ప్రశ్నపత్రాలు లీకైనట్లు దేశవ్యాప్తంగా దుమారం చెలరేగడంతో ఎన్‌టీఏ కొన్ని పరీక్షల్ని రద్దుచేసింది.. మరికొన్నింటిని వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని