కొత్త నేర న్యాయచట్టాలపై 1న పోలీస్‌ స్టేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలు

కొత్త నేర న్యాయచట్టాలు అమల్లోకి వచ్చే జులై ఒకటిన దేశవ్యాప్తంగా ఉన్న 17,500 పోలీస్‌ స్టేషన్లు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నాయి.

Published : 29 Jun 2024 05:38 IST

దిల్లీ: కొత్త నేర న్యాయచట్టాలు అమల్లోకి వచ్చే జులై ఒకటిన దేశవ్యాప్తంగా ఉన్న 17,500 పోలీస్‌ స్టేషన్లు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నాయి. ఇందులో మహిళలకు, యువతకు, విద్యార్థులకు కొత్త చట్టాల్లోని కీలక అంశాలపై అవగాహన కల్పించనున్నారు. బ్రిటిష్‌ పాలన నాటి ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌ జులై ఒకటి నుంచి అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఆ రోజు పోలీస్‌ స్టేషన్లతో పాటు.. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌  (యూజీసీ) పరిధిలోని అన్ని విద్యాలయాలు, సంస్థల్లో కూడా కొత్త చట్టాలపై చర్చలు, సెమినార్లు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని