విమానం మరుగుదొడ్డిలో పొగతాగిన వ్యక్తి అరెస్టు

దేశ రాజధాని దిల్లీ నుంచి ముంబయికి వెళుతున్న ఇండిగో విమానంలోని మరుగుదొడ్డిలో పొగ తాగిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు.

Published : 29 Jun 2024 05:37 IST

ముంబయి: దేశ రాజధాని దిల్లీ నుంచి ముంబయికి వెళుతున్న ఇండిగో విమానంలోని మరుగుదొడ్డిలో పొగ తాగిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. 176 మంది ప్రయాణికులతో బుధవారం సాయంత్రం 5.15 గంటలకు విమానం బయలుదేరింది. గమ్యస్థానానికి చేరేందుకు మరో 50 నిమిషాలు ఉండగా ఖాలీల్‌ కాజమ్ముల్‌ ఖాన్‌(38) అనే ప్రయాణికుడు మరుగుదొడ్డిలోకి వెళ్లి సిగరెట్‌ కాల్చాడు. పొగను గుర్తించే సెన్సర్లు హెచ్చరించడంతో అప్రమత్తమైన క్యాబిన్‌ సిబ్బంది.. నిందితుడు బయటకు వచ్చిన అనంతరం తనిఖీలు చేపట్టి కాల్చిన సిగరెట్‌ పీకతో పాటు, అగ్గిపెట్టెను గుర్తించారు. ప్రయాణికుడు కూడా నేరాన్ని అంగీకరించడంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముంబయిలో దిగిన తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, సహార్‌ స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని