నీట్‌ నుంచి తమిళనాడును మినహాయించండి

వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ‘నీట్‌’ నుంచి తమిళనాడును మినహాయించాలని, ఇందుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని శుక్రవారం తమిళనాడు శాసనసభలో ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.

Published : 29 Jun 2024 04:33 IST

కేంద్రాన్ని కోరిన ముఖ్యమంత్రి స్టాలిన్‌

సైదాపేట, న్యూస్‌టుడే: వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ‘నీట్‌’ నుంచి తమిళనాడును మినహాయించాలని, ఇందుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని శుక్రవారం తమిళనాడు శాసనసభలో ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఆయన మాట్లాడుతూ.. నీట్‌లో ఇటీవల జరిగిన అవకతవకలు పోటీ పరీక్షలపై విద్యార్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాయని తెలిపారు. నీట్‌ నిర్వహణపై ఆరోపణలను నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత సీబీఐ విచారణకు ఆదేశించిందన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్, బిహార్‌ ప్రతిపక్ష నేత తేజస్వియాదవ్‌ తదితర నేతలు నీట్‌ను రద్దు చేయాలని లేఖలు రాశారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని