భారతీయ రాకెట్‌ ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహం

ఇస్రో వాణిజ్య విభాగమైన ఎన్‌ఎస్‌ఐఎల్‌ తన కొత్త రాకెట్‌ ఎస్‌.ఎస్‌.ఎల్‌.వి.ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు బుధవారం ప్రకటించింది.

Published : 27 Jun 2024 05:42 IST

దిల్లీ: ఇస్రో వాణిజ్య విభాగమైన ఎన్‌ఎస్‌ఐఎల్‌ తన కొత్త రాకెట్‌ ఎస్‌.ఎస్‌.ఎల్‌.వి.ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు బుధవారం ప్రకటించింది. స్పేస్‌ మెషీన్స్‌ కంపెనీ తయారుచేసిన ఆప్టిమస్‌ ఉపగ్రహాన్ని ఎన్‌ఎస్‌ఐఎల్‌.. కక్ష్యలోకి ప్రయోగిస్తుందని రెండు కంపెనీలు దిల్లీలో ప్రకటించాయి. 450 కిలోల బరువైన ఆప్టిమస్‌.. ఆస్ట్రేలియా తయారుచేసిన అతి భారీ ఉపగ్రహం. 10 కిలోల బరువైన జానస్‌ ఉపగ్రహాన్ని ఎస్‌.ఎస్‌.ఎల్‌.వి. ఇంతకుముందు ప్రయోగించిందని ఎన్‌ఎస్‌ఐఎల్‌ చైర్మన్‌ రాధాకృష్ణన్‌ దురైరాజ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని