వ్యవస్థ మొత్తం బెయిల్‌ను అడ్డుకుంటోంది: సునీతా కేజ్రీవాల్‌

జైలు నుంచి తన భర్త విడుదల కాకుండా వ్యవస్థ మొత్తం పనిచేస్తున్నట్లుగా ఉందని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ ఆరోపించారు.

Published : 27 Jun 2024 05:42 IST

దిల్లీ: జైలు నుంచి తన భర్త విడుదల కాకుండా వ్యవస్థ మొత్తం పనిచేస్తున్నట్లుగా ఉందని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ ఆరోపించారు. ‘ఈ నెల 20న దిల్లీ ముఖ్యమంత్రికి బెయిల్‌ లభించినప్పటికీ ఈడీ వెంటనే దానిపై స్టే తీసుకొచ్చింది. ఆ మరుసటి రోజే సీబీఐ రంగంలోకి దిగి కేజ్రీవాల్‌ను ఆరెస్టు చేసింది. వ్యవస్థ మొత్తం కేజ్రీవాల్‌ను బయటకు రానివ్వరాదని ప్రయత్నిస్తోంది. ఇది నియంతృత్వం’ అంటూ సునీతా కేజ్రీవాల్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. కేజ్రీవాల్‌ను సీబీఐ ఆరెస్టు చేయడాన్ని ఆప్‌ ఖండించింది. సీబీఐ ద్వారా బూటకపు కేసు పెట్టించి కేజ్రీవాల్‌ను అరెస్టు చేయించిందంటూ భాజపాపై ధ్వజమెత్తింది. దిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం పట్ల కేంద్ర సర్కారు వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు. భాజపాయేతర పార్టీల ముఖ్యమంత్రులకు కష్టాలు అధికమయ్యాయన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దిల్లీ మంత్రి ఆతిశీని పరామర్శించిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని