జమ్మూ కశ్మీర్‌లో కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లా అటవీ ప్రాంతంలో బుధవారం సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు దుండగులు హతమయ్యారు.

Published : 27 Jun 2024 05:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లా అటవీ ప్రాంతంలో బుధవారం సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు దుండగులు హతమయ్యారు. వారంతా పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్‌కు చెందిన వారిగా ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవల జూన్‌ 11, 12వ తేదీల్లో ఉగ్రవాదులు దాడులు జరిపిన నేపథ్యంలో స్థానిక పోలీసులు, ఆర్మీ సిబ్బంది, సీఆర్‌పీఎఫ్‌ దళాలు సంయుక్తంగా ముందస్తు తనిఖీలు చేపట్టాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం బజాద్‌ అనే గ్రామంలో సోదాలు నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా ఓ మట్టి ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన మన భద్రతా బృందాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఈ క్రమంలో ముగ్గురు ముష్కరులు హతమైనట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. వారి వద్ద నుంచి రెండు ఎం4 కార్బైన్లు, ఏకే సిరీస్‌ రైఫిళ్లు, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు