పుణెలో ఓ వైద్యుడు సహా కుమార్తెకు జికా వైరస్‌

మహారాష్ట్రలోని పుణెలో ఓ వైద్యుడు(46), ఆయన కుమార్తె(15)కు జికా వైరస్‌ సోకింది. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌(పీఎంసీ)అధికారులు బుధవారం తెలిపారు.

Published : 27 Jun 2024 05:41 IST

పుణె: మహారాష్ట్రలోని పుణెలో ఓ వైద్యుడు(46), ఆయన కుమార్తె(15)కు జికా వైరస్‌ సోకింది. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌(పీఎంసీ)అధికారులు బుధవారం తెలిపారు. నగరంలోని ఎరండ్‌వానే ప్రాంతానికి చెందిన ఓ వైద్యుడికి జ్వరంతో పాటు శరీరంపై దద్దుర్లు రావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా, ఆయన రక్తనమూనాలను నగరంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపించారు. జూన్‌ 21న ఆయన్ని జికా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారించినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరీక్షించగా కుమార్తెకు కూడా వైరస్‌ సోకినట్లు గుర్తించారు. దీంతో వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. రెండు కేసులు నమోదు కావడంతో అప్రమత్తమైన వైద్యాధికారులు ఆ ప్రాంతంలో వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని