రాడార్‌కు అందని సాంకేతికత

రాడార్‌ సిగ్నళ్లకు అందకుండా ఉండటంతోపాటు రక్షణ వ్యవస్థల చుట్టూ మైక్రోవేవ్‌ కవచంలా పనిచేసే సాంకేతికతను బుధవారం భారతీయ నౌకా దళానికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అందజేసింది.

Published : 27 Jun 2024 05:41 IST

- నౌకాదళానికి అందించిన డీఆర్‌డీవో

దిల్లీ: రాడార్‌ సిగ్నళ్లకు అందకుండా ఉండటంతోపాటు రక్షణ వ్యవస్థల చుట్టూ మైక్రోవేవ్‌ కవచంలా పనిచేసే సాంకేతికతను బుధవారం భారతీయ నౌకా దళానికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అందజేసింది. మధ్య శ్రేణి-మైక్రోవేవ్‌ అబ్‌స్క్యూరెంట్‌ చాఫ్‌ రాకెట్‌ (ఎంఆర్‌-ఎంవోసీఆర్‌) అనే ఈ వ్యవస్థను నౌకాదళ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్షన్‌ బ్రిజేశ్‌ వశిష్ఠకు డీఆర్‌డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి కామత్‌ అందజేశారు. దీనిని డీఆర్‌డీవో జోధ్‌పుర్‌ యూనిట్‌ రూపొందించింది. ఈ రాకెట్‌ను ఫైర్‌ చేసినప్పుడు రక్షణ వ్యవస్థల చుట్టూ మైక్రోవేవ్‌ మేఘాలు ఏర్పడి ముప్పుల నుంచి రక్షణగా నిలుస్తాయి. ఎంఆర్‌-ఎంవోసీఆర్‌ తొలి దశను యుద్ధ నౌకల నుంచి విజయవంతంగా పరీక్షించారు. రెండో దశలో రాడార్‌ క్రాస్‌ సెక్షన్‌ రిడక్షన్‌ ఆఫ్‌ ఏరియల్‌ లక్ష్యాలను 90శాతం సాధించారు. ఈ వ్యవస్థను అభివృద్ధి చేసిన డీఆర్‌డీవోను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు. ఆత్మ నిర్భరతలో మరో ముందడుగని అభివర్ణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని