వేర్వేరు ఇంటిపేర్లున్నా ఆన్‌లైన్‌ టికెట్లు తీసుకోవచ్చు: రైల్వే

వేర్వేరు ఇంటిపేర్లు ఉన్నవారికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా రైలు టికెట్లు తీసుకోవడంపై ఆంక్షలు విధించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని రైల్వేశాఖ తోసిపుచ్చింది.

Updated : 26 Jun 2024 06:27 IST

దిల్లీ: వేర్వేరు ఇంటిపేర్లు ఉన్నవారికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా రైలు టికెట్లు తీసుకోవడంపై ఆంక్షలు విధించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని రైల్వేశాఖ తోసిపుచ్చింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సమాచారం అవాస్తవమని ఖండించింది. ‘‘రైల్వేబోర్డు మార్గదర్శకాలను అనుసరించి ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు తీసుకోవచ్చు. ఆ మార్గదర్శకాలు ఏమిటనేది ప్రజా బాహుళ్యానికి అందుబాటులో ఉన్నాయి. ఐఆర్‌సీటీసీలో వ్యక్తిగత ఐడీ ఉన్నవారు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కోసం టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఒక ఖాతా నుంచి నెలకు 12 టికెట్ల వరకు పొందవచ్చు. ఆధార్‌తో ధ్రువీకరించుకున్న ఖాతా అయితే ఆ వ్యక్తి నెలకు 24 టికెట్లు బుక్‌ చేయవచ్చు. దాని కోసం ప్రతి టికెట్‌లో కనీసం ఒకరి ఆధార్‌ ధ్రువీకరణ కూడా అయి ఉంటే చాలు. వ్యక్తిగత ఐడీపై తీసుకున్న టికెట్లను వాణిజ్య ప్రాతిపదికన విక్రయించడం మాత్రం రైల్వేచట్టం కింద నేరమే’’ అని రైల్వే అధికార ప్రతినిధి స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు