ఎడారి మీదుగా ఎక్స్‌ప్రెస్‌ వే

రాజస్థాన్‌లోని ఎడారి మీదుగా అమృత్‌సర్, జామ్‌నగర్‌ల మధ్య నిర్మిస్తున్న సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను 2025 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (నాయ్‌) లక్ష్యంగా పెట్టుకొంది.

Published : 26 Jun 2024 06:12 IST

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌ వద్ద కొనసాగుతున్న రహదారి నిర్మాణం 

దిల్లీ: రాజస్థాన్‌లోని ఎడారి మీదుగా అమృత్‌సర్, జామ్‌నగర్‌ల మధ్య నిర్మిస్తున్న సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను 2025 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (నాయ్‌) లక్ష్యంగా పెట్టుకొంది. దిల్లీ, ముంబయిల మధ్య నిర్మిస్తున్న రహదారి 1,350 కి.మీ. పొడవుతో ఎనిమిది వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగా గుర్తింపు పొందింది. అదేవిధంగా మరో మార్గాన్ని కేంద్రం నిర్మిస్తోంది. దేశంలో రెండో అత్యంత పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్‌ వేను పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌ వరకు 1,316 కి.మీ. మేర నిర్మంచనున్నారు. ఇది వాడుకలోకి వస్తే ఈ నగరాల మధ్య ప్రయాణ దూరం, ఖర్చులు తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ వే రాజస్థాన్‌ మీదుగా వందల కిలోమీటర్ల ఎడారిని దాటుతూ పలు పారిశ్రామికవాడలను కలుపుతుంది. దీనివల్ల రాష్ట్రాల మధ్య అనుసంధానం, ఆర్థిక కార్యకలాపాలు మెరుగవుతాయి. అమృత్‌సర్‌ నుంచి జామ్‌నగర్‌ చేరుకోడానికి ప్రస్తుతం 1,516 కి.మీ. దూరం ప్రయాణించాల్సి వస్తోంది. దీనికి దాదాపు 26 గంటల సమయం పడుతుంది. కొత్త ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణంతో ఈ నగరాల మధ్య దూరం 200 కి.మీ. తగ్గుతుంది. పైగా కేవలం 13 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ఈ రోడ్డు పంజాబ్, దిల్లీ, రాజస్థాన్, హరియాణాలను నేరుగా అనుసంధానిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని