దిల్లీ మంత్రి ఆతిశీ నీటి దీక్షకు ముగింపు

దేశ రాజధాని నగరం నీటిసమస్యను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోగ్యం క్షీణించటంతో మంగళవారం తెల్లవారుజామున ఆమెను ఆసుపత్రికి తరలించారు.

Published : 26 Jun 2024 06:13 IST

ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలింపు

ఆతిశీని ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది

దిల్లీ: దేశ రాజధాని నగరం నీటిసమస్యను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోగ్యం క్షీణించటంతో మంగళవారం తెల్లవారుజామున ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లోక్‌నాయక్‌ (ఎల్‌ఎన్‌జేపీ) హాస్పిటల్‌ ఐసీయూ వార్డులో మంత్రి చికిత్స పొందుతున్నారని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ‘‘ఆతిశీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో ఎల్‌ఎన్‌జేపీ వైద్యులు వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. హరియాణా ప్రభుత్వం దిల్లీకి నీటిని విడుదల చేయాలన్న డిమాండుతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఆమె గత అయిదు రోజులుగా ఏమీ తినలేదు. ఆతిశీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం’’ అని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఆసుపత్రికి తరలింపుతో మంత్రి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష ముగిసినా, తమ మిత్రపక్షాలతో కలిసి ఈ విషయాన్ని పార్లమెంటులో లేవదీస్తామని ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌ మీడియాకు తెలిపారు. యమునానది నీటిలో హరియాణా నుంచి దిల్లీకి  అందాల్సిన న్యాయమైన వాటాపై ఇప్పటికే తమ ఎంపీలంతా ప్రధానికి లేఖ రాసినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు