సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్‌అదాలత్‌లో పాల్గొనండి

న్యాయస్థానాలలో పెండింగ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో సత్వర తీర్పులు వెలువడే లోక్‌అదాలత్‌ సేవలను వినియోగించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పిలుపునిచ్చారు.

Published : 26 Jun 2024 06:10 IST

ప్రజలు, న్యాయవాదులకు సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ పిలుపు

దిల్లీ: న్యాయస్థానాలలో పెండింగ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో సత్వర తీర్పులు వెలువడే లోక్‌అదాలత్‌ సేవలను వినియోగించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని జులై 29 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ప్రత్యేక లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. కక్షిదారులు సామరస్యంగా, స్వచ్ఛందంగా తమ వివాదాలను పరిష్కరించుకోవడానికి లోక్‌అదాలత్‌ దోహదపడుతుందన్నారు. పిటిషనర్లు, న్యాయవాదులు, న్యాయమూర్తులు అందరూ ఈ మహాక్రతువులో భాగస్వాములు కావాలని ఓ వీడియో సందేశంలో జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు ఉన్న వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 1950, జనవరి 26న భారత రాజ్యాంగం అమలుతో పాటు సుప్రీంకోర్టు మనుగడలోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని