చరిత్రలో తొలిసారిగా గుప్త్‌ పర్వతం అధిరోహించాం

హిమాలయాల్లో ఇప్పటి వరకూ ఎవరూ అధిరోహించని ‘గుప్త్‌’ పర్వతంపై తొమ్మిది మందితో కూడిన తమ బృందం కాలు మోపిందని కోల్‌కతాకు చెందిన సోనార్‌పుర్‌ ఆరోహీ పర్వతారోహకుల క్లబ్‌ ప్రకటించింది.

Published : 26 Jun 2024 06:12 IST

పశ్చిమబెంగాల్‌ పర్వతారోహకుల క్లబ్‌ వెల్లడి

కోల్‌కతా: హిమాలయాల్లో ఇప్పటి వరకూ ఎవరూ అధిరోహించని ‘గుప్త్‌’ పర్వతంపై తొమ్మిది మందితో కూడిన తమ బృందం కాలు మోపిందని కోల్‌కతాకు చెందిన సోనార్‌పుర్‌ ఆరోహీ పర్వతారోహకుల క్లబ్‌ ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్‌ జిల్లా పీర్‌పంజాల్‌ పర్వత సానువుల్లో ఈ పర్వత రాజం 5,988 మీటర్ల ఎత్తు ఉంటుంది. చుట్టూ ఎత్తైన కొండలు ఉండడం, ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితుల వల్ల ఈ పర్వతాన్ని చూడడం, కనీసం ఫొటో తీయడం కూడా సాధ్యం కాదని నిపుణులు చెబుతుంటారు. అందుకే దీనికి గుప్త్‌ పర్వతం అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. దీనిని అధిరోహించేందుకు జూన్‌ 3న తొమ్మిది మందితో కూడిన పర్వతారోహకుల బృందం కోల్‌కతా నుంచి యాత్రను ప్రారంభించింది. మంగళవారం ఉదయం 8:45 గంటలకు గుప్త్‌ పర్వతంపైకి చేరుకుంది. సోనార్‌పుర్‌ ఆరోహీ నిర్వాహకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం బృంద సభ్యులు కిందకు దిగుతున్నారని, వారంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని