అయోధ్య ఆలయంలో లీకేజీ లేదు: నృపేంద్ర మిశ్ర

అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్టు వచ్చిన ఆరోపణల్ని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్ర తోసిపుచ్చారు.

Published : 26 Jun 2024 06:09 IST

అయోధ్య: అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్టు వచ్చిన ఆరోపణల్ని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్ర తోసిపుచ్చారు. ‘ఆలయ నిర్మాణ పనుల్ని ఈరోజు ప్రత్యక్షంగా పర్యవేక్షించాను. పైకప్పు నుంచి నీరు కారడంలేదు. కరెంటు వైర్ల కోసం పెట్టిన పైపుల్ని ఇంకా మూయకపోవడంతో అందులోంచి నీరు లోపలికి వచ్చింది. మొదటి అంతస్తు పనులు ఇంకా జరుగుతున్నాయి. దాంతోపాటు ఇప్పటికే ప్రారంభమైన రెండో అంతస్తు పైకప్పు నిర్మాణం పూర్తయితే ఆలయం లోపలికి నీరు రావడం ఆగిపోతుంది’ అని మిశ్ర మంగళవారం తెలిపారు. శనివారం భారీ వర్షం పడటంతో గర్భగుడిలోకి వర్షం నీరు కారుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్‌ సోమవారం ఆరోపించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని