తెల్ల రంగేశాడు.. పోలీసులకు దొరికేశాడు!

జుట్టుకు, గడ్డానికి తెల్లరంగు వేసుకొని.. అరవయ్యేళ్ల వృద్ధుడిలా బోల్తాకొట్టించి.. దేశం దాటిపోదామనుకున్న ఓ యువకుడిని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అడ్డుకున్నారు. 24 ఏళ్ల గురు సేవక్‌ సింగ్‌ కెనడా వెళ్లేందుకు బుధవారం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు.

Published : 20 Jun 2024 06:42 IST

దేశం దాటేందుకు యువకుడి విఫలయత్నం

దిల్లీ: జుట్టుకు, గడ్డానికి తెల్లరంగు వేసుకొని.. అరవయ్యేళ్ల వృద్ధుడిలా బోల్తాకొట్టించి.. దేశం దాటిపోదామనుకున్న ఓ యువకుడిని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అడ్డుకున్నారు. 24 ఏళ్ల గురు సేవక్‌ సింగ్‌ కెనడా వెళ్లేందుకు బుధవారం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. అతడి కదలికలపై సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి అనుమానం రావడంతో నిశితంగా పరిశీలించారు. గుర్తింపు కార్డు చూపించాలని కోరగా.. రష్వీందర్‌ సింగ్‌(67) పేరిట ఉన్న ఓ పాస్‌పోర్టును వారికిచ్చాడు. కానీ.. అతడి శరీర తీరు, చర్మం, గొంతు మాత్రం వారికి నమ్మశక్యంగా అనిపించలేదు. దాంతో అనుమానంతో ఇంకాస్త విచారించగా.. అసలు విషయం బయటపడింది. ముసలివాడిలా కనిపించేందుకు జుట్టుకు, గడ్డానికి తెల్ల రంగు వేసుకోవడంతోపాటు కళ్లజోడు కూడా పెట్టుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత తన అసలు పాస్‌పోర్టు ఫొటోను అతడి ఫోన్‌లో గుర్తించారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం వస్తువులతో సహా నిందితుడిని దిల్లీ పోలీసులకు అప్పగించినట్లు సీఐఎస్‌ఎఫ్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని