పురాతన భవంతి కూలుస్తుండగా బయటపడ్డ బంగారు నాణేలు

ఓ పురాతన భవంతిని కూలుస్తుండగా బ్రిటిష్‌ కాలం(1922) నాటి బంగారు నాణేలు బయటపడ్డాయి.

Published : 02 Jan 2024 04:35 IST

చోరీ చేసిన కాంట్రాక్టరు, కూలీల అరెస్టు

నవసారీ: ఓ పురాతన భవంతిని కూలుస్తుండగా బ్రిటిష్‌ కాలం(1922) నాటి బంగారు నాణేలు బయటపడ్డాయి. కింగ్‌ జార్జ్‌-5 బొమ్మ ముద్రించి ఉన్న ఆ విలువైన నాణేలను కూల్చివేత పనులు చేపట్టిన కాంట్రాక్టరు, నలుగురు కూలీలు ఇంటి యజమానికి తెలియకుండా చోరీ చేశారు. దీనిపై యజమాని గతేడాది అక్టోబరులోనే ఫిర్యాదు చేయగా పోలీసులు తాజాగా నిందితులను అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండుకు తరలించారు. గుజరాత్‌లోని నవసారీ జిల్లా బిలిమోరాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిటన్‌లో నివసిస్తున్న హవబెన్‌ బలియా అనే ప్రవాస భారతీయుడు.. సర్ఫరాజ్‌ కరదియా అనే కాంట్రాక్టరుకు ఇల్లు కూల్చే పని అప్పగించారు. ఆయన మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురు కూలీలను తీసుకొచ్చి దానిని కూల్చివేస్తుండగా.. బంగారు నాణేలు బయటపడటంతో వాటిని తీసుకెళ్లిపోయారు. వారి నుంచి పోలీసులు రూ.92 లక్షల విలువైన 199 నాణేలను స్వాధీనం చేసుకున్నారు. అయితే దర్యాప్తు సమయంలో తమ నుంచి కొన్ని నాణేలను మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురు పోలీసులు తీసుకున్నారని ఓ కూలీ ఫిర్యాదు చేయడంతో వారిని కూడా అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు