Madras HC: ఎంఎస్‌ ధోనీ వేసిన కోర్టు ధిక్కార కేసులో.. ఐపీఎస్‌ అధికారికి జైలుశిక్ష

ప్రముఖ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీ వేసిన కోర్టుధిక్కార కేసులో ఐపీఎస్‌ అధికారికి 15 రోజుల జైలుశిక్ష విధిస్తూ మద్రాసు హైకోర్టు ఆదేశించింది.

Updated : 16 Dec 2023 09:56 IST

చెన్నై (ఆర్కేనగర్‌), న్యూస్‌టుడే: ప్రముఖ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీ వేసిన కోర్టుధిక్కార కేసులో ఐపీఎస్‌ అధికారికి 15 రోజుల జైలుశిక్ష విధిస్తూ మద్రాసు హైకోర్టు ఆదేశించింది. 2013లో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఫిక్సింగ్‌ ఆరోపణల గురించి టీవీ చర్చలో తనకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. ఐపీఎస్‌ అధికారి సంపత్‌కుమార్‌, జీ మీడియా కార్పొరేషన్‌పై ధోనీ 2014లో మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. పరువునష్టం కలిగించినందుకు రూ.100 కోట్ల పరిహారం ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. ఐపీఎస్‌ అధికారి సంపత్‌కుమార్‌ తరఫున తగిన వివరణ ఇవ్వకపోవడంతో కోర్టుధిక్కార చర్యలు చేపట్టాలని ధోనీ పిటిషన్‌ వేశారు. ఇది న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌ఎస్‌ సుందర్‌, జస్టిస్‌ సుందర్‌మోహన్‌ ఎదుట విచారణకు వచ్చింది. సమయం ఇచ్చినా తగిన వివరణ ఇవ్వకపోవడంతో 15రోజుల పాటు జైలుశిక్ష విధిస్తూ ఆదేశించారు. శిక్షను నిలిపి ఉంచాలని ఐపీఎస్‌ అధికారి తరఫున న్యాయవాది విన్నవించగా అంగీకరించారు. అప్పీలు చేసుకునేందుకు వీలుగా 30 రోజుల పాటు శిక్షను నిలిపివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని