Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఐదుగురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌ అడవులు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. ఛత్తీస్‌గఢ్‌- మహారాష్ట్ర సరిహద్దులోని నారాయణ్‌పుర్‌ జిల్లా కోహ్‌మెట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని కుర్రేవాయ్‌-షుమండి అటవీ ప్రాంతంలో మంగళవారం భద్రతా బలగాలు,

Published : 03 Jul 2024 03:38 IST

చర్ల, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌ అడవులు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. ఛత్తీస్‌గఢ్‌- మహారాష్ట్ర సరిహద్దులోని నారాయణ్‌పుర్‌ జిల్లా కోహ్‌మెట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని కుర్రేవాయ్‌-షుమండి అటవీ ప్రాంతంలో మంగళవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. రాత్రి వరకూ ఇరువర్గాల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు. స్థానిక పోలీసులు, బీఎస్‌ఎఫ్, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు (ఐటీబీపీ) కలిపి మొత్తం 1400 మంది సోమవారం ఈ ఆపరేషన్‌కు బయలుదేరి వెళ్లారు. షుమండి అటవీ ప్రాంతంలో మంగళవారం వీరిరాకను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులకు దిగడంతో ప్రతిగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. 11 మంది మావోయిస్టులు మృతి చెందారనే వార్తలు వచ్చినా.. ఉన్నతాధికారులు ధ్రువీకరించలేదు. ఘటనా ప్రాంతం కీకారణ్యం కావడంతో, ఇంకా పూర్తి సమాచారం అందలేదని బస్తర్‌ ఐజీ సుందరరాజ్‌.పి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని