Hemant Soren: భూ కుంభకోణం కేసులో బెయిల్‌.. హేమంత్‌ సోరెన్‌ విడుదల

Hemant Soren: ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ జైలు నుంచి విడుదలయ్యారు.

Published : 28 Jun 2024 18:43 IST

రాంచీ: ఝార్ఖండ్‌ (Jharkhand) మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) బిర్సా ముండా జైలు నుంచి విడుదలయ్యారు. భూ కుంభకోణానికి (Land Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై జైలుకెళ్లిన ఆయనకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో దాదాపు 5 నెలల అనంతరం జైలు నుంచి బయటకు వచ్చారు. తనను తప్పుడుగా ఇరికించారని.. రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తల గొంతు నొక్కుతున్నారని.. జైలు నుంచి విడుదలైన అనంతరం హేమంత్‌ ఆరోపించారు.

సోరెన్‌ను చూసేందుకు జేఎంఎం శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున జైలు వద్దకు తరలివచ్చారు. పార్టీ కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత తన తండ్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్‌ నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. మద్దతు తెలిపిన వారికి, న్యాయవ్యవస్థకు హేమంత్‌ సతీమణి కల్పనా సోరెన్‌ ధన్యవాదాలు తెలిపారు.

దిల్లీ ఎయిర్‌పోర్టు ఘటన.. నాటి పౌర విమానయానశాఖ మంత్రి ఏమన్నారంటే

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఝార్ఖండ్‌ ముక్తిమోర్చ (JMM) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ను ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన బిర్సా ముండా జైల్లో ఉన్నారు. అరెస్టుకు కొన్ని గంటల ముందే ఆయన నాటకీయ పరిణామాల నడుమ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. నూతన సీఎంగా చంపయీ సోరెన్‌ బాధ్యతలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని