Mumbai: టీషర్ట్, చిరిగిన జీన్స్‌తో కళాశాలకు రావొద్దు

కళాశాల ఆవరణలో విద్యార్థులు హిజాబ్‌ ధరించడాన్ని నిషేధించి ఇటీవల వార్తల్లో నిలిచిన చెంబూర్‌ ట్రాంబే ఎడ్యుకేషనల్‌ సొసైటీ.. తాజాగా టీషర్ట్‌లు, చిరిగిన జీన్స్‌(టాన్‌)పైనా నిషేధం విధించింది.

Updated : 03 Jul 2024 08:14 IST

ముంబయిలోని ఓ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆదేశాలు

ముంబయి: కళాశాల ఆవరణలో విద్యార్థులు హిజాబ్‌ ధరించడాన్ని నిషేధించి ఇటీవల వార్తల్లో నిలిచిన చెంబూర్‌ ట్రాంబే ఎడ్యుకేషనల్‌ సొసైటీ.. తాజాగా టీషర్ట్‌లు, చిరిగిన జీన్స్‌(టాన్‌)పైనా నిషేధం విధించింది. తమ కళాశాలకు వచ్చే విద్యార్థులు సాంస్కృతిక అసమానతల్ని సూచించే దుస్తులతో రావొద్దని ఆదేశించింది. ముంబయిలో ఈ సొసైటీ నిర్వహిస్తోన్న ఎన్‌జీ ఆచార్య, డీకే మరాఠే కళాశాలల్లో చిరిగిన జీన్స్, టీషర్టులు, జెర్సీలతో వస్తే అనుమతించబోమని.. ఫార్మల్, డీసెంట్‌ దుస్తులతో పాటు హాఫ్‌ లేదా ఫుల్‌ షర్ట్, ప్యాంటు ధరించవచ్చని సూచించింది. అమ్మాయిలు భారతీయ లేదా పాశ్చాత్య దుస్తులు ధరించినా అభ్యంతరం లేదని పేర్కొంటూ జూన్‌ 27న నోటీసు జారీ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని