NEET Row: తప్పు చేసిన ఎవరినీ ఉపేక్షించం.. ‘నీట్‌’ వ్యవహారంపై ధర్మేంద్ర ప్రధాన్‌

NEET Row| నీట్‌ పరీక్ష వ్యవహారంలో తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు.

Published : 20 Jun 2024 20:49 IST

దిల్లీ: వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ పరీక్ష (NEET 2024) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వివరణ ఇచ్చారు. ఈ పరీక్షలో జరిగిన తప్పులు నిర్దిష్టమైన ప్రాంతాలకు మాత్రమే పరిమితమని, ఉత్తీర్ణత సాధించిన లక్షలాది మందిపై ప్రభావం ఉండదన్నారు. నీట్‌ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షలో అవకతవకలపై బిహార్‌ ప్రభుత్వంతో చర్చిస్తున్నామన్నారు.

అవును.. పరీక్షకు ముందురోజు రాత్రే నీట్ పేపర్‌ అందింది: అంగీకరించిన విద్యార్థులు

అవసరమైతే నేషనల్‌ టెస్టింగ్  ఏజెన్సీ (NTA) అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. పారదర్శకంగా పరీక్షల నిర్వహణే తమ తొలి ప్రాధాన్యమని.. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదన్నారు. తప్పు చేసిన ఎవరినీ ఉపేక్షించబోమని చెప్పారు. విద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని