Mohan Bhagwat: ఎన్ని విభేదాలున్నా.. దేశమంతా ఒక్కటే: మోహన్‌ భాగవత్‌

దేశ ప్రజల ఐక్యతను ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ కొనియాడారు. ఎన్ని విభేదాలున్నా.. శత్రుదేశాలు దాడులకు యత్నించినప్పుడు దేశమంతా ఒక్కటవుతుందన్నారు.

Published : 01 Jul 2024 21:23 IST

దిల్లీ: భారత్‌లో ఎన్ని అంతర్గత విభేదాలున్నా దేశ ప్రజలంతా ఒక్కటేనని ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ (Mohan Bhagwat) పేర్కొన్నారు. శత్రుదేశాలు మనపై దాడికి యత్నించినప్పుడు అది స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. భారత సైనికుడు అబ్దుల్‌ హామీద్‌ జీవితం ఆధారంగా రచించిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో సోమవారం పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.

1965లో భారత్‌- పాకిస్థాన్‌ మధ్య జరిగిన యుద్ధంలో వీర మరణం పొందిన అబ్దుల్‌ హామీద్‌ను మోహన్‌ భాగవత్‌ కొనియాడారు. ‘‘మన దేశంలో అంతర్గతంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ.. వేల ఏళ్లుగా ప్రజలంతా కలిసికట్టుగా ఉన్నారనడంలో సందేహం లేదు. పాకిస్థాన్‌, చైనా వంటి శత్రుదేశాలు భారత్‌పై దాడికి యత్నించిన సమయంలో వారి ఐక్యత స్పష్టంగా కనిపించింది’’ అని పేర్కొన్నారు.

‘మోదీజీ నవ్వరెందుకో’.. రాహుల్‌ ప్రశ్నకు ప్రధాని ఏం చెప్పారంటే?

చైనా దురాక్రమణ, పాకిస్థాన్‌ దాడుల సమయంలో దేశంలో ‘భిన్నత్వంలో ఏకత్వం’ కనిపిస్తోందన్నారు. మాతృభూమిపై ప్రజలు ఎనలేని ప్రేమ, అభిమానం చూపుతున్నారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ జిల్లాలో జన్మించిన అబ్దుల్‌ హామీద్‌ భారత సైనికుడు. మరణాంతరం భారత ప్రభుత్వం ఆయనకు పరమ వీర్‌ చక్ర ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు