Medha Patkar: పరువునష్టం కేసు.. మేధా పాట్కర్‌కు అయిదు నెలల జైలుశిక్ష

ఓ పరువునష్టం కేసులో ‘నర్మదా బచావో ఆందోళన్‌’ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు దిల్లీ కోర్టు అయిదు నెలల జైలుశిక్ష విధించింది.

Published : 01 Jul 2024 17:45 IST

దిల్లీ: ఓ పరువునష్టం కేసులో సామాజిక కార్యకర్త, ‘నర్మదా బచావో ఆందోళన్‌’ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ (Medha Patkar)కు దిల్లీ కోర్టు అయిదు నెలల జైలు శిక్ష విధించింది. 23 ఏళ్ల క్రితం నాటి ఈ కేసును ప్రస్తుతం దిల్లీ ఎల్‌జీగా ఉన్న వీకే సక్సేనా దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ రాఘవ్‌ శర్మ ఈ ఏడాది మేలో ఆమెను దోషిగా నిర్ధరిస్తూ తీర్పు వెలువరించారు. తాజాగా అయిదు నెలల సాధారణ జైలు శిక్షను ఖరారు చేయడంతోపాటు రూ.10 లక్షల జరిమానా విధించారు. అయితే.. తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు వీలుగా శిక్షను ఒక నెలపాటు నిలుపుదల చేశారు.

మోదీ అంతరిక్షంలోకి వెళ్లగలరా? - ఇస్రో చీఫ్‌ ఏమన్నారంటే?

మేధా పాట్కర్‌, వీకే సక్సేనాల మధ్య 2000 సంవత్సరం నుంచి న్యాయపోరాటం సాగుతోంది. తనతోపాటు ‘నర్మదా బచావో ఆందోళన్‌’కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారనే ఆరోపణలపై సక్సేనాపై ఆమె అప్పట్లో కేసు వేశారు. ఆ సమయంలో ఆయన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ కేంద్రంగా ఉన్న ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌’ అనే ఎన్జీవోకు చీఫ్‌గా ఉన్నారు. మరోవైపు.. ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు పరువు నష్టం కలిగించేలా పత్రికా ప్రకటన జారీ చేశారని ఆరోపిస్తూ పాట్కర్‌పై ఆయన సైతం 2001లో రెండు కేసులు దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు