West Bengal: ‘వివాహేతర సంబంధం’పై ఆగ్రహం.. బెంగాల్‌లో ఓ జంటకు బహిరంగ శిక్ష

వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంగా పశ్చిమబెంగాల్‌లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా చావగొట్టిన వీడియో వైరల్‌గా మారడంతో ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.

Published : 01 Jul 2024 05:12 IST

రాయ్‌గంజ్‌ (పశ్చిమబెంగాల్‌): వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంగా పశ్చిమబెంగాల్‌లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా చావగొట్టిన వీడియో వైరల్‌గా మారడంతో ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వీడియోలో వెదురుకర్రతో జంటను ఇష్టానుసారం కొడుతున్న వ్యక్తి ఉత్తర్‌ దినాజ్‌పుర్‌ జిల్లాలోని చోప్రా ప్రాంత టీఎంసీ నేత తాజ్‌ముల్‌ అలియాస్‌ జేసీబీగా గుర్తించి అరెస్టు చేశారు. సుమోటోగా కేసు నమోదుచేసిన పోలీసులు బాధిత జంటకు రక్షణ కల్పించినట్లు తెలిపారు. ఈ అమానవీయ ఘటనపై భాజపా, కాంగ్రెస్, సీపీఎం మండిపడ్డాయి. ‘‘పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ పాలనకు ఇదే నిదర్శనం’’ అంటూ భాజపా ఐటీ సెల్‌ హెడ్‌ అమిత్‌ మాలవీయ ‘ఎక్స్‌’లో దాడి వీడియోను పోస్టు చేశారు. బెంగాల్‌లోనూ బుల్డోజర్‌ న్యాయం అమలవుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ మహ్మద్‌ సలీం ధ్వజమెత్తారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి శంతను సేన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఘటనలు దారుణం. అయితే, ఇటువంటి బహిరంగ కంగారూ కోర్టులు సీపీఎం పాలనలో సర్వసాధారణంగా ఉండేవి’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని