NEET Row: నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో మరో కీలక సూత్రధారి అరెస్టు

నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో సీబీఐ అధికారులు మరో అరెస్టు చేశారు.

Published : 03 Jul 2024 22:15 IST

దిల్లీ: నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీబీఐ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇటీవల కొందరిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. తాజాగా ఈ కేసులో మరో కీలక సూత్రధారి అమన్‌ సింగ్‌ను అరెస్టు చేశారు.  ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే  హజారీబాగ్‌లోని ఒయాసిస్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అక్కడ కాలిపోయిన ప్రశ్నపత్రాలను బిహార్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు సీబీఐ ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. బిహార్‌లో పేపర్‌ లీకేజీకి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగా.. గుజరాత్‌, రాజస్థాన్‌లలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు అభ్యర్థులను మోసం చేయడానికి సంబంధించినవి. 

నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో సమగ్ర దర్యాప్తు చేయాలని కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష జరగ్గా.. దాదాపు 23 లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని