Yediyurappa: నాపై ఉన్న పోక్సో కేసును కొట్టేయండి: యడియూరప్ప

పోక్సో చట్టం కింద తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు.

Published : 28 Jun 2024 16:45 IST

దిల్లీ: తనపై దాఖలైన పోక్సో(POCSO) కేసును రద్దు చేయాలని కర్ణాటక(Karnataka) మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప(Yediyurappa) కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోక్సో కేసుకు సంబంధించిన ప్రత్యేక కోర్టులో ఆయనపై పోలీసులు గురువారం ఛార్జిషీట్ దాఖలు చేశారు.

17 ఏళ్ల బాలికపై యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడినట్లు లోక్‌సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆరోపణలు వచ్చాయి. ఓ మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను ఆయన బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో సదాశివనగర్ పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు.  ప్రస్తుతం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్(CID) ఈ కేసుపై దర్యాప్తు చేస్తోంది.

ఆరోపణలు చేసిన బాధితురాలి తల్లి ఇటీవల ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయారు. అయితే, అంతకంటే ముందే బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను సీఐడీ రికార్డ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఈ ఆరోపణలను మాజీ సీఎం ఖండించారు. తనపై కుట్రలకు పాల్పడేవారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని