Arvind Kejriwal: సీబీఐ జ్యుడీషియల్‌ కస్టడీకి కేజ్రీవాల్‌.. అనుమతించిన కోర్టు

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను 14 రోజుల పాటు సీబీఐ జ్యుడీషియల్‌ కస్టడీకి అనుమతిస్తూ దిల్లీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Published : 29 Jun 2024 18:39 IST

దిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆప్ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను 14 రోజుల పాటు సీబీఐ జ్యుడీషియల్‌ కస్టడీకి అనుమతిస్తూ దిల్లీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీబీఐ చేసిన విజ్ఞప్తికి కోర్టు శనివారం అంగీకారం తెలిపింది.

విచారణ సమయంలో కేజ్రీవాల్‌ సరిగా సహకరించలేదని సీబీఐ రిమాండ్‌ దరఖాస్తులో కోర్టుకు తెలిపింది. నేరం నుంచి తప్పించుకునేందుకు సాక్ష్యాలకు విరుద్ధంగా సమాధానాలు ఇచ్చారని.. కొన్నింటికి అసలు సమాధానం చెప్పలేదని వెల్లడించింది. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని ఆరోపించింది. దీంతో మరికొన్ని రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరింది.

‘దీనికి నెహ్రూను నిందించొద్దు ప్లీజ్‌’.. భాజపా పోస్ట్‌ వైరల్‌

సీబీఐ అభ్యర్థనను పరిశీలించిన దిల్లీ న్యాయస్థానం.. కేజ్రీవాల్‌ను జులై 12 వరకు జ్యుడీషియల్‌ కస్టడీకి అనుమతించింది. ఆయనను ఆ రోజు కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది. అయితే.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ అభ్యర్థించిన కొన్ని గంటలకే కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. మనీలాండరింగ్‌ కేసులో కోర్టు అనుమతితో ఇప్పటికే ఆయన్ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు