ఏనుగులకు అనారోగ్యం.. 3500కి.మీ వెళ్లి కాపాడిన ‘అంబానీ’ బృందం

జబ్బుపడిన ఓ ఏనుగును, దాని పిల్లను కాపాడేందుకుగానూ ‘వన్‌తార’ సిబ్బంది ఏకంగా 3500 కిలోమీటర్లు ప్రయాణించిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది.

Updated : 13 May 2024 17:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుమారుల్లో ఒకరైన అనంత్‌ అంబానీ (Anant Ambani)కి జంతువులంటే అమితమైన ప్రేమ. ‘వన్‌తార (Vantara)’ పేరుతో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఓ జంతు సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జబ్బుపడిన ఓ ఏనుగును, దాని పిల్లను కాపాడేందుకుగానూ ‘వన్‌తార’ సిబ్బంది ఏకంగా 3500 కిలోమీటర్లు ప్రయాణించిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. సమాచారం అందిన 24 గంటల్లోపే ఆ మూగప్రాణులకు చికిత్స అందించి, వాటి ప్రాణాలు నిలబెట్టడం విశేషం.

అనంత్‌ మాటలకు.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ అంబానీ

త్రిపురలోని ఉనకోటి జిల్లాలో ఓ ఏనుగు, దాని పిల్ల అనారోగ్యంతో బాధపడుతున్నాయని, చికిత్స అందించాల్సిందిగా కోరుతూ ‘వన్‌తార’కు ఓ ఈమెయిల్‌ వచ్చింది. దీనిపై తక్షణమే స్పందించిన సిబ్బంది.. వెంటనే ఉనకోటికి పయనమయ్యారు. 24 గంటల్లోనే అక్కడికి చేరుకున్న వైద్య బృందం.. తక్షణమే చికిత్స మొదలుపెట్టింది. వాటికి వైద్యంతోపాటు ఆహారాన్ని అందించి ప్రాణాలు నిలబెట్టింది. ఈ ప్రక్రియను మొత్తం ఓ మహిళ వీడియో తీశారు. దీనిపై స్పందించిన అనంత్‌ సోదరుడు ఆకాశ్‌ అంబానీ ఫ్యాన్‌ పేజీలో.. సోదరుడికి హ్యాట్సాఫ్‌ చెబుతూ వీడియోను ఎక్స్‌ (ట్విటర్‌)లో షేర్‌ చేశారు. ఇది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. మూగజీవాల కోసం  అనంత్‌ చేస్తోన్న ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని