Ahmedabad rains: గుజరాత్‌లో భారీ వర్షాలు.. రోడ్డుపై భారీ గుంత.. కాంగ్రెస్‌ చురకలు

అహ్మదాబాద్‌ను వర్షం అతలాకుతలం చేసింది. నగరంలోని ప్రధాన రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడింది.

Published : 01 Jul 2024 00:05 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపిలేకుండా కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రవాణా ఎక్కడికక్కడ స్తంభించిపోయింంది. అహ్మదాబాద్‌ను వర్షం అతలాకుతలం చేసింది. పలు చోట్ల రోడ్డుపక్కన ఉన్న చెట్లు కూకటి వేళ్లతో కూలిపోయాయి. నగరంలోని ప్రధాన రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడింది.  దీంతో అటువైపు రాకపోకలు నిలిచిపోయాయి. అండర్‌ పాస్‌లన్నీ నీటితో నిండిపోయాయి. మరో నాలుగురోజులు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సూరత్‌, భుజ్‌, భరూచ్‌, అహ్మదాబాద్‌ తదితర చోట్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. సూరత్‌లోని పల్సానా ప్రాంతంలో 10 గంటల వ్యవధిలో గరిష్ఠంగా 153 మి.మీ వర్షం కురిసింది. అహ్మదాబాద్‌లోని కేకే నగర్‌లో కారుపై భారీవృక్షం కూలిపోయింది. 

కాంగ్రెస్‌  చురకలు

అహ్మదాబాద్‌లో రోడ్డు మధ్యలో గుంతపడిన సంఘటనను కేరళ కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా మలచుకుంది. ఆ గుంతలోకి పెద్దమొత్తంలో నీరు చేరుతున్న వీడియోను ‘ఎక్స్‌’లో పోస్టు చేస్తూ.. ‘‘ అహ్మదాబాద్‌ స్మార్ట్‌ సిటీలో భూగర్భంలో నీటిని నిల్వచేసే విధానాన్ని తాజాగా ప్రారంభించారు. దీనివల్ల ఒక్క నీటి చుక్క కూడా అరేబియా సముద్రంలో కలిసే అవకాశం లేదు’’ అంటూ ఎద్దేవా చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని