cyber fraud: ఆర్మీ అధికారినంటూ నమ్మించి.. హాస్య నటుడిని మోసగించిన కేటుగాడు

సైబర్‌ కేటుగాడి మాటల మాయలో పడి ఓ హాస్య నటుడు మోసపోయాడు.

Updated : 02 Jan 2024 18:15 IST

ముంబయి: సైబర్‌ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కి అమాయకులు రూ.లక్షలు కోల్పోతున్నారు. తాజాగా హాస్య నటుడిని సైబర్‌ నేరగాడు మోసం చేశాడు. ఆర్మీ ఆఫీసర్‌గా నాటకమాడి ఆయన నుంచి రూ. 85 వేలు కొట్టేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

హాస్య నటుడైన రాకేశ్‌ బేడీ (Rakesh Bedi)పుణెలో తనకున్న ఓ ఇంటిని అమ్మాలనుకున్నారు. ఓ హౌసింగ్‌ పోర్టల్‌లో ఆస్తికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. మరుసటి రోజు ఓ సైబర్‌ నేరగాడు బేడీకి ఫోన్‌ చేశాడు. తాను ఆర్మీలో పని చేస్తున్నానంటూ నమ్మించాడు. గతంలోనూ బేడీ సైన్యంలో పనిచేసే అధికారికి ఇంటిని విక్రయించివున్నారు. దీంతో ఇతడు కూడా నిజమైన అధికారి అని అనుకున్నారు. అతడి మాటలు నమ్మి తన ఆస్తిని అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ట్రక్కు డ్రైవర్ల నిరసన.. పెట్రోల్‌ బంక్‌లకు పోటెత్తిన వాహనదారులు

ముందుగా లక్ష రూపాయలను బదిలీ చేస్తానని ఆ కేటుగాడు చెప్పాడు. బదిలీ ప్రక్రియలో కొన్ని సమస్యలు ఉన్నాయని.. బేడీ సతీమణి  బ్యాంక్‌ వివరాలు చెప్పాలని కోరాడు. అందుకు సరే అన్న బేడీ ఆమె ఖాతా వివరాలు పంపించారు. ఎక్కువ మొత్తంలో డబ్బు బదిలీ చేయడం కోసం బ్యాంక్‌ నుంచి సందేశం వస్తుందని సైబర్‌ కేటుగాడు నమ్మించాడు. అంగీకరిస్తే వెంటనే డబ్బు జమ అవుతుందని అన్నాడు. ఆ తర్వాత డబ్బు రాకపోవడమే కాక ఆమె అకౌంట్‌ నుంచి రూ.50 వేలు మాయం అయ్యాయి.

వెంటనే బేడీ అతడికి ఫోన్‌ చేశారు. బదిలీ ప్రక్రియలో పొరపాటు జరిగిందని రీఫండ్‌ కోసం రూ. 30 వేలు ఖాతాలో డిపాజిట్‌ చేయమని కోరాడు. ఆ డబ్బు కూడా పోవడంతో  పోలీస్‌ స్టేషన్‌లో బేడీ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  రాకేశ్‌ బేడీ టీవీ షోలు, సినిమాల్లో నటించారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సన్నీ దేవోల్‌ నటించిన ‘గదర్‌ 2’ సినిమాలోనూ బేడీ నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు