NEET Row: నీట్‌ వివాదం.. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు ఆప్‌ డిమాండ్‌

నీట్‌ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆప్‌ డిమాండ్‌ చేసింది.

Published : 19 Jun 2024 17:52 IST

దిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ పరీక్ష (NEET 2024)లో అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై ఆప్‌  దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. తాజాగా ఆ పార్టీ ఎంపీ సందీప్‌ పాఠక్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు. పేపర్‌ లీకేజీలను భాజపా వ్యవస్థీకృతం చేస్తోందని, నీట్‌ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

నిను వీడని నీడను నేనే: భర్తను చంపేందుకు ప్లాన్‌-ఏ, బీ అమలు..!

నీట్‌ పరీక్షకు కొద్ది రోజుల ముందే భారీ అవినీతి జరిగిందన్న ఆయన.. ఈ దేశానికి నీట్‌ పరీక్ష ఎంతో కీలకమైనదన్నారు. వైద్య కళాశాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలన్నీ ఈ పరీక్ష ద్వారానే చేపడతారని గుర్తు చేశారు. దాదాపు లక్ష సీట్లు ఉంటే.. దేశవ్యాప్తంగా 24లక్షల మంది విద్యార్థులు పోటీ పడ్డారన్నారు. విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి ప్రిపేర్‌ అయ్యారని.. ఈ ప్రక్రియలో వారి కుటుంబాలు సైతం భాగస్వాములయ్యాయన్నారు. ఈ వ్యవహారాన్ని ఆప్‌ రాజకీయం చేయదలచుకోలేదని చెప్పిన పాఠక్‌.. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై కచ్చితంగా స్పందించాలని కోరారు. కేంద్ర విద్యాశాఖమంత్రిని సస్పెండ్‌ చేయాలి లేదా సంబంధిత మంత్రి తనకు తానుగా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని