Bomb Threat: దేశవ్యాప్తంగా 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు!

దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే ఏకంగా 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు రావడం గమనార్హం.

Published : 18 Jun 2024 21:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని విమానాశ్రయాలు, విమానాలకు బాంబు బెదిరింపు (Bomb Threat) ఘటనలు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 41 ఎయిర్‌పోర్టులకు బెదిరింపు ఈమెయిళ్లు రావడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆయా విమానాశ్రయాల్లో రంగంలోకి దిగిన భద్రత సిబ్బంది.. పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. వాటిని నకిలీ బెదిరింపులుగా తేల్చారు. చెన్నై- దుబాయ్‌ విమానానికీ బాంబు బెదిరింపు రాగా..  క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన అనంతరం కాస్త ఆలస్యంగా గమ్యస్థానానికి బయల్దేరింది.

రూ.కోట్ల ఖర్చు.. ప్రారంభానికి ముందే కుప్పకూలిన బ్రిడ్జి

‘‘ఎయిర్‌పోర్టులో పేలుడు పదార్థాలు ఉన్నాయి. త్వరలోనే బాంబులు పేలతాయి. మీరందరూ చనిపోతారు’’ అంటూ అన్ని విమానాశ్రయాలకు దాదాపు ఒకే తరహా బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ విభాగం అధికారులు ఆ ఈమెయిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. ‘కేఎన్‌ఆర్‌’ అనే ఆన్‌లైన్ బృందం ఈ నకిలీ బెదిరింపుల వెనుక ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మే 1న సైతం దిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు పాఠశాలలకు ఈ గ్రూప్‌ ఇదే తరహా ఈమెయిళ్లు పంపినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని