Mumbai: ముంబయి అల్లర్ల నిందితుడు.. 31 ఏళ్ల తర్వాత చిక్కాడు!

మూడు దశాబ్దాల క్రితం నాటి ముంబయి అలర్ల కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

Published : 02 Jul 2024 16:51 IST

ముంబయి: మూడు దశాబ్దాల క్రితం నాటి ముంబయి (Mumbai) అల్లర్ల కేసులో తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 1993లో ముంబయిలో అలర్లు చెలరేగాయి. ఆ సమయంలో నగరంలో చట్టవిరుద్ధంగా జనాలను పోగు చేసిన కేసుతోపాటు ఓ హత్య ఘటనలో సయ్యద్‌ నాదిర్‌ షా అబ్బాస్‌ ఖాన్‌ (65) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన అతడు.. అప్పటినుంచి కనిపించకుండా పోయాడు.

జిగాన గన్స్‌.. రూ.25 లక్షల కాంట్రాక్ట్‌..: కారులోనే సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర

దీంతో కోర్టు అతడిని పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించి.. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది. సెంట్రల్‌ ముంబయి సేవ్రీలోని నిందితుడి ఇంటికి పోలీసులు అనేకసార్లు వెళ్లినా.. ఆచూకీ గుర్తించలేకపోయారు. చివరకు బంధువుల ఫోన్ల రికార్డులను పరిశీలించగా.. ఎట్టకేలకు ఆచూకీ లభ్యమైంది. జూన్ 29న తన ఇంటికి వెళ్తున్నట్లు సమాచారం అందింది. దీంతో ప్రణాళిక ప్రకారం వ్యవహరించిన పోలీసులు వలపన్ని అతడిని అరెస్టు చేశారు. 1993 కేసులో నిందితుడిని మళ్లీ అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు