AP News: వైవీయూ వీసీ, రిజిస్ట్రార్‌ రాజీనామా.. ఆమోదించిన ప్రభుత్వం

యోగి వేమన వర్సిటీ(వైవీయూ) వైస్‌ ఛాన్సలర్‌ చింతా సుధాకర్‌, రిజిస్ట్రార్‌ వెంకటసుబ్బయ్య రాజీనామా చేశారు. 

Published : 29 Jun 2024 18:52 IST

అమరావతి: యోగి వేమన వర్సిటీ(వైవీయూ) ఉప కులపతి చింతా సుధాకర్‌, రిజిస్ట్రార్‌ వెంకటసుబ్బయ్య రాజీనామా చేశారు. వారి రాజీనామాలను ఉన్నత విద్యామండలి ఆమోదించింది. వీరిద్దరూ వైకాపాతో అంటకాగినట్లు ఆరోపణలున్నాయి. ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా వైవీయూ ప్రిన్సిపల్‌ రఘునాథ్‌రెడ్డికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు విక్రమ సింహపురి వర్సిటీ రిజిస్ట్రార్‌ పదవికి రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. అనంతరం కడపలోని వైవీయూలో ప్రొఫెసర్‌గా చేరారు. 

కడప ఆర్కిటెక్చర్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ సురేంద్ర రిలీవ్‌ 

నిబంధనలకు విరుద్ధంగా కడప ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉన్న సురేంద్రనాథ్‌రెడ్డి రిలీవ్‌ అయ్యారు. ప్రభుత్వం మారడంతో తనను రిలీవ్‌ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆయన దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వం రిలీవ్‌ చేయాలని నిర్ణయించింది. దీంతో ఆయన తిరిగి వైవీయూలో ప్రొఫెసర్‌గా చేరనున్నారు. మూడేళ్లపాటు సురేంద్ర ఆర్కిటెక్చర్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌గా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని