Amaravati: ఏపీ సచివాలయంలో ఐదు రోజులే పనిదినాలు.. మరో ఏడాది పొడిగింపు

రాజధాని ప్రాంత పరిధిలో రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగుల పనిదినాలు వారానికి ఐదు రోజులను మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Published : 27 Jun 2024 19:55 IST

అమరావతి: రాజధాని ప్రాంత పరిధిలో రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పనిదినాలు వారానికి ఐదు రోజులను మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంబంధిత ఫైల్‌కు ఆమోదం తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారు. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉద్యోగులు విధులు నిర్వహించాలని, ఇవాళ్టి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశాల్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని