Pawan kalyan: ఐదేళ్లలో కేంద్రం విడుదల చేసిన రూ.1,066 కోట్లు ఏమయ్యాయి?: డిప్యూటీ సీఎం పవన్‌

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు.

Published : 26 Jun 2024 16:53 IST

అమరావతి: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు. కార్పొరేషన్‌ పనితీరుపై డిప్యూటీ సీఎంకు అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. స్వచ్ఛాంధ్రకు నిధుల లభ్యత, ఖర్చుల వివరాలపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. గత ఐదేళ్లలో కేంద్రం విడుదల చేసిన రూ.1,066 కోట్లు ఏమయ్యాయని అధికారులను ప్రశ్నించారు. కేంద్ర నిధులను రాష్ట్ర ఆర్థికశాఖ స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదని అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరాశాఖలపై గురువారం డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు